పోస్టులు ఖాళీ.. వారిపైనే భారం!

NLG: జిల్లాలో విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అసిస్టెంట్ లైన్‌మెన్ పోస్టులు 50, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 122 భర్తీ చేయాల్సి ఉంది. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయన్నారు.