VIDEO: అన్నారం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతి) బ్యారేజీకి వరద ఉద్ధృతి భారీగా పెరుగుతోంది. మానేరు నది నుంచి 1,06,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతోంది. అధికారులు 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం తెలిపారు.