హిందూపురం వైసీపీ నేతకు కీలక పదవి

హిందూపురం వైసీపీ నేతకు కీలక పదవి

సత్యసాయి: పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కొల్లకుంట వరుణ్ రెడ్డి రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపికా రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కృషి చేస్తానని వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నియామకం స్థానిక శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.