VIDEO: విద్యార్థుల ఆధ్వర్యంలో రైతు సదస్సు
కృష్ణా: గుడివాడ ANR కళాశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు మంగళవారం రైతు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక సాగు పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వ్యవసాయ రంగానికి యువత సహకారం ఎంతో అవసరమని తెలిపారు.