తిమ్మాపూర్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు, త్యాగాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోని ప్రకాష్, ఉప సర్పంచ్ సతీష్, మండల నాయకులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.