వన మహోత్సవానికి 25 లక్షల మొక్కలు సిద్ధం

KMM: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని 571నర్సరీల్లో 25లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు సిద్దం చేశారు. ఈసారి తాటి, ఈత మొక్కలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈమొక్కలు నేల కోతను సమర్థవంతంగా అరికట్టి భూగర్భ జలాలను పెంచుతాయన్నారు.