పీలేరులో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

పీలేరులో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: పీలేరులో వీఎస్‌ఎన్ సిద్ధార్థ హైస్కూల్‌లో ఇవాళ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. అగ్నిప్రమాదాలు, గ్యాస్, ఆయిల్ ఫైర్‌లను ఎలా నియంత్రించాలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రెస్క్యూ, ఎస్కేపింగ్ పద్ధతులను ప్రయోగాత్మకంగా చూపించి, కరపత్రాలు పంచారు. ప్రమాదాల సమయంలో 101కు సంప్రదించాలని తెలిపారు.