'బాల్య వివాహాలు నివారిద్దాం.. బాలికలను చదివిద్దాం'

CTR: చిత్తూరు జిల్లాలో బాల్య వివాహాలు నివారించి, బాలికలను విద్యా వంతులుగా ఎదిగేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శిశు సంక్షేమ సాధికారిక అధికారి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కురబలకోట శిశు సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో బాలికలు- బాల్యవివాహాలు- నష్టాలు అనే అంశంపై గ్రామపంచాయతీ వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.