పూడి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
TPT: తడ మండలంలోని పూడి గ్రామాన్ని శుక్రవారం ఎమ్మెల్యే విజయశ్రీ సందర్శించారు. గత 40 ఏళ్లుగా రోడ్డు వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. రోడ్ల దుస్థితిని స్వయంగా ఆమె పరిశీలించి, వెంటనే శాశ్వత రోడ్డు నిర్మాణం చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బురదమయంగా మారిన గ్రామ రోడ్లను అతి త్వరలో బాగు చేస్తామని పేర్కొన్నారు.