నిరుపయోగంగా వాటర్ ట్యాంక్.. అందని తాగునీరు
కోనసీమ: అమలాపురం రూరల్ మండలంలోని పేరూరు రజకపేటలో నిర్మించిన వాటర్ ట్యాంకు నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్యాంకు నిర్మించినా, చెరువు నుంచి పైప్‌లైన్ అనుసంధానం చేయకపోవడంతో రెండేళ్లుగా తాగునీరు అందడం లేదని ఆరోపిస్తున్నారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని, వెంటనే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు