అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

VKB: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కుల్కచర్ల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక సిబ్బందిచే అవగాహన కల్పించారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఫైర్ ఆఫీసర్ సేవ్యా నాయక్ అవగాహన కల్పించారు.