బాధిత కుటంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు

GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో, ఆ విద్యార్థిని కుటుంబానికి సహాయం చేయడానికి జూలేకల్ గ్రామానికి చెందిన యువత ముందుకు వచ్చింది. మంగళవారం యువత రూ. 27,200 సేకరించి ఆ మొత్తాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎవరికి ఏ సమస్య వచ్చినా తోటి గ్రామస్తులు ఆదుకోవాలన్నారు.