అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
PDPL: సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో నిన్న రాత్రి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు రూ. 10 లక్షల సీసీ రోడ్డు పనులు, రూ. 20 లక్షల గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.