'సమన్వయంతో నేరాల కట్టడికి కృషి చేద్దాం'
NRPT: మూడు రాష్ట్రాల సరిహద్దు పోలీసులు సమన్వయంతో పని చేసి నేరాల కట్టడికి, కేసుల ఛేదనకు కృషి చేద్దామని మక్తల్ సీఐ రామ్ లాల్ అన్నారు. బుధవారం రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని శక్తి నగర్ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సరిహద్దు పోలీసులు నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సరిహద్దుల్లో జరిగే నేరాల గురించి సమాచారం పరస్పరం తీసుకొని కేసులు పరిష్కారించాలని కోరారు.