పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
JGL: గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి ఉన్నత పాఠశాలలో 2006-07 సంవత్సరంలో టెన్త్ పూర్తి చేసుకున్న బాల్యమిత్రులు 19 ఏళ్లకు కలుసుకొని సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న వీరు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.