పంట పొలాల్లో అరుదైన గద్ద ప్రత్యక్షం

పంట పొలాల్లో అరుదైన గద్ద ప్రత్యక్షం

ASR: గూడెంకొత్తవీధి మండలం నిట్టమామిడిపాలెంలోని పంటపొలాల్లో ఇవాళ ఉదయం స్థానికులకు అరుదైన గద్ద కనిపించింది. వేల మైళ్ళు దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి అలసి పొలంలో పడిపోయి ఉంటుందని గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. స్పిలోరిన్ షీలా అని పిలిచే ఈ శికరషర్ప గద్ద అండమాన్ నికోబార్ దీవులు వంటి ఎత్తైన ఘాట్లలో సంచరిస్తుందని అటవీ శాఖ చింతపల్లి డి.ఎఫ్.ఓ నరసింహారావు తెలిపారు.