VIDEO: దగదర్తిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం ప్రత్యేక అలంకరణలో శ్రీకృష్ణ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు.