ఇలా స్నానం చేయండి..!

ఇలా స్నానం చేయండి..!

బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకోండి. అంటే చీకట్లో స్నానం చేయడం అన్నమాట. దీన్నే 'డార్క్ షవరింగ్' అంటారు. చీకటిగా ఉన్నప్పుడు చుట్టూ ఏమున్నాయన్న స్పష్టత ఉండదు. ట్యాప్‌లు, సబ్బు అన్నింటినీ తడిమి చూసుకోవాల్సిందే. దృష్టంతా స్నానం మీదే ఉంటుంది. ఇక వేరే ఆలోచనలకు తావుండదు. అంటే మైండ్ ఫుల్‌గా స్నానం చేస్తామన్నమాట. ఈ క్రమంలో ఒత్తిడి దూరమవుతుందట.