ఆస్తిపన్ను బకాయిపై రాయితీ గడువు పెంపు

ఆస్తిపన్ను బకాయిపై రాయితీ గడువు పెంపు

AP: రాష్ట్రంలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50% రాయితీని ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలోని పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.