నత్తనడకన డ్రైనేజీ నిర్మాణ పనులు..!
VKB: కొడంగల్-కోస్గి రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న డ్రైనేజీ పనులు గుత్తేదారుల ఇష్టారాజ్యంగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు నత్తనడకతో సాగుతూ, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, క్యూరింగ్ కూడా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా, పనులను నాణ్యతగా, వేగంగా పూర్తి చేయించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.