కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

E.G: ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదంలో దేవరపల్లి యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొడమంచిలి సతీష్ అకాలంగా మృతి చెందడం తీవ్ర వేదన కలిగించిందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. కుటుంబానికి ఆధారం అయిన సతీష్ కోల్పోవడం తల్లిదండ్రులకు భార్య, ఇద్దరు చిన్నారి పిల్లలకు తీరని లోటు అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను కలిసి రూ.50,000 సహాయం అందించారు.