ప్రమాదకర పరిస్థితుల్లో మంచినీటి బావులు

ELR: చింతలపూడిలోని మంచినీటి బావులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. గతంలో ప్రజలకు ప్రధానంగా నీటిని అందించిన ఈ బావులు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నగర పంచాయతీ సిబ్బంది పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో బావుల ఉపరితలం రోడ్డుకు సమానంగా మారింది. దీంతో పిల్లలు, పశువులు బావిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.