భారత టీమ్‌లోకి కదిరి యువతి ఎంపిక

భారత టీమ్‌లోకి కదిరి యువతి ఎంపిక

SS: భారత గోల్ షాట్ బాల్ క్రీడా జట్టులోకి కదిరిలోని నిజాంవలి కాలనీకి చెందిన ఫరాన్ సభా ఖానం ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ గోల్ షాట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సభా ఖానం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోందని చెప్పారు. క్రీడలో ప్రతిభ చూపుతున్న ఆమెను అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి ఎం.మనోహర్తో పాటు పలువురు నాయకులు అభినందించారు.