బాలిక హత్య కేసు.. పిన్నే హంతకురాలు

JGL: కోరుట్ల ఆదర్శనగర్‌లో శనివారం రాత్రి చిన్నారి హితీక్ష దారుణ హత్యకు గురైన విషయం తెలిసిదే. కాగా, ఈ కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి పిన్ని మమతనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హితీక్ష తల్లిపై కోపంతోనే బాలికను హతమార్చినట్లు సమాచారం. చిన్నారి కుటుంబపై అసూయతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితురాలిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.