నారా లోకేష్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ విడుదల
ATP: మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 7న మ.12.30కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15కు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం సా.4.30కు కల్యాణదుర్గంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు కనకదాసు విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.