'రైతుల సంక్షేమానికి కృషి'
AKP: రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు పాయకరావుపేట పీఏసీఎస్ చైర్మన్ డి. రాజ బాబు తెలిపారు. స్థానిక సొసైటీ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. సొసైటీ ద్వారా రైతులకు రూ.112 కోట్లు రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.2.25 కోట్లు రికవరీ చేశామన్నారు. రైతులకు సకాలంలో రుణాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.