రోడ్డుపై పారుతున్న మురుగునీరు
KMR: జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 8వ వార్డులో మురుగు కాలువల పరిస్థితి అద్వాన స్థితిలో మారాయి. మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో రోడ్డుపై నుంచి మురుగునీరు పారుతున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై మురుగునీరు పారకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.