సచివాలయాన్ని సందర్శించిన డిప్యూటీ ఎంపీడీవో
AKP: నాతవరం డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు మండలంలోని ఎర్రవరం సచివాలయాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయంలో డిజిటల్ సేవలు ఏ విధంగా అందుతున్నాయనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు.