పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

ATP: మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడైన అమర్‌నాథ రెడ్డి (36)కి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు జడ్జి చిన్నబాబు తీర్పు చెప్పారు. 2022 ఏప్రిల్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా నిందితుడు ఐదేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై పోక్సో కేసు నమోదు కాగా.. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది.