బీఆర్ఎస్‌లోకి ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు

NZB: ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వర్ని మండల కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్ రావు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కేటీఆర్‌ను కలిశారు. శ్రీనివాస్ రావుతో పాటు వర్ని మండలం నుంచి మరి కొంతమంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో వర్ని మండలంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.