నెట్టింట వైరల్ అవుతున్న అంతరిక్ష చిత్రం
సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగర అంతరిక్ష చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ప్రధాన ఆరాధనా స్థలం అయిన కాబా గృహం మెరిసిపోతూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోను వ్యోమగామి డాన్ పెటిట్ ఐఎస్ఎస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తీశారు. ఈ చిత్రాన్ని నెట్టింట షేర్ చేస్తూ.. 'మధ్యలో వెలుగులు వెదజల్లుతుంది పవిత్ర కాబా గృహం. అది స్పేస్ నుంచి కనిపిస్తోంది' అని పెటిట్ రాసుకొచ్చారు.