ఘట్కేసర్‌లో ఉప్పల్ యువతి MISSING

MDCL: యువతి అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన సంజన(18) ఈనెల 3వ తేదీన బస్సులో కళాశాలకు వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో సంజన తల్లి కళాశాలకు వెళ్లి విచారించింది. కాలేజీకి వచ్చి వెళ్లిందని చెప్పడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించారు. కనిపించకపోవడంతో పోలిసులకు ఫిర్యాదు చేశారు.