బస్సు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి
తమిళనాడులోని కొవైపుదూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో నడుచుకుంటూ వస్తున్న ఆమె కడ్డీని అందుకోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా బస్సు నుంచి జారిపడింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హృదయ విదారక దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.