నాటి హేలాపురే.. నేటి ఏలూరు
ELR: 2022లో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కొన్ని మండలాలను వేరు చేసి, ఏలూరు జిల్లా ఏర్పాటు చేయబడింది. ఏలూరు పేరు విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. చరిత్రకారుల ప్రకారం, విష్ణుకుండినల కాలంలో ఈ ప్రాంతాన్నిహేలాపురి అని పిలిచేవారు. కాలక్రమేణా హేలాపురి ఏలూరుగా మారింది. మరో అభిప్రాయం ప్రకారం, పూర్వం 5 గ్రామాల సమూహంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలుగూరుగా పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు.