సందర్శకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం

సందర్శకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం

అల్లూరి: అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది సందర్శించారు.