'అంగన్వాడీ కేంద్రం, సచివాలయం తనిఖీ'
ప్రకాశం: కంభం పట్టణంలోని 4వ సచివాలయం, అర్బన్ కాలనీలో గల అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం ఎంపీడీవో వీరభద్రాచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారా నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.