పదో తరగతి ఓపెన్ పరీక్షలకు 92 శాతం హాజరు

పదో తరగతి ఓపెన్ పరీక్షలకు 92 శాతం హాజరు

WNP: పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 397 మంది విద్యార్థులకు గాను 364 మంది (92%) హాజరుకాగా 33 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనితో పాటు హైదరాబాద్ స్టేట్ టీం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనల మేరకు పరీక్షలు సుజావుగా జరిగినట్టు అధికారులు వెల్లడించారు.