భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
ATP: తాడిపత్రి పట్టణం ఏటిగడ్డ పాలెంకు చెందిన జేసీ అనుచరుడు రోషన్న సతీమణి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇవాళ వారి నివాసానికి వెళ్లారు. మృతి చెందిన రోషన్న సతీమణి భౌతికకాయానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోషన్న కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.