VIDEO: మహబూబాబాద్‌లోని సెల్ షాప్ లో అగ్నిప్రమాదం
MHBD: జిల్లా కేంద్రంలోని నెహ్రు సెంటర్‌లో గల మణి సెల్ షాప్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అట్టి సమయంలో సెల్ షాప్ మూసివేసి ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే షాపు యజమానికి సమాచారాన్ని చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న షాప్ నిర్వాహకులు స్థానికుల సహాయంతో మంటలను అర్పివేశారు.