వర్షాలకు కొట్టుకుపోయిన మెరక కాలువ గేట్లు

AKP: మాకవరపాలెం మండలంలో వర్షాలకు మాకవరపాలెం మెరక కాలవ గేట్లు కొట్టుకుపోవడంతో నీరు వృధాగా పారుతోంది. ఈ కాలువ గుండా సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఇటీవల గేట్లకు మరమ్మతులు చేసి రైతులు తాత్కాలికంగా గట్టు నిర్మించారు. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు గేట్లు కొట్టుకోవడంతో కాలువకు భారీ గండి పడింది. దీనికి కాలువ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.