'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు'

'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు'

సత్యసాయి: జిల్లాలో మైనర్లు వాహనాలు నడపకుండా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించిన మైనర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.