క్షతగాత్రులను పరామర్శించిన ఆర్టీసీ అధికారులు

క్షతగాత్రులను పరామర్శించిన ఆర్టీసీ అధికారులు

PPM: ఈనెల 19న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మందుగుండు సామాగ్రి పేలి ఘటనలో విశాఖ కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏటీఎం వాణిజ్య విభాగం అధికారిణి దివ్య, డిపో మేనేజర్ లక్ష్మణరావు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం డిపో సిబ్బంది, పార్సెల్ ఏజెంట్స్ తరపున కొంత ఆర్ధిక సహాయం వారికి అందించారు.