జలసాధన కమిటీ నాయకులు ముందస్తు అరెస్ట్
MHBD: మున్నేరు-పాలేరు లింకు కెనాల్ నిర్మాణ సర్వేను అడ్డుకుంటారనే అనుమానంతో జలసాధన కమిటీ నాయకులను గార్ల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ దుబ్బగూడెంలో సర్వే నిర్వహిస్తుండగా, నిరసనలకు దిగకుండా కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నాయకులు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.