తిరుపతి వెళ్లే రైళ్లకు ఈ స్టేషన్‌లలో హాల్టింగ్
KNR: జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం తిరుపతి వెళ్లే రైళ్లకు కోరుట్ల, జగిత్యాల స్టేషన్‌లలో హాల్టింగ్ కల్పించారు. ఆయా స్టేషన్‌లలో 2 నిమిషాల పాటు రైళ్లు ఆపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ అధికారి ఏ. శ్రీధర్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జగిత్యాలలో తిరుపతి రైలు ఆగుతుండగా.. తాజాగా కోరుట్లలో అనుమతించారు.