ఏపీలో సినీ పరిశ్రమకు బూస్ట్
బాపట్ల: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చిత్రీకరణలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు కల్పిస్తూ, స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు రాయితీలు, భారీ చిత్రాలకు టికెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.