మర్రివలసలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రారంభం

మర్రివలసలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రారంభం

VZM: గజపతినగరం మండలంలోని మర్రివలస ప్రాథమిక పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ చల్ల అర్జున్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంగ్లం ఆవశ్యకతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకల చంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్ దేవి, గ్రామ పెద్దలు సూర్యనారాయణ, భాస్కర్, యువత పాల్గొన్నారు.