శబలా భోజనాలకు ఆహ్వానం
VSP: ఏప్రిల్ 1 నుంచి 5 వరకు సింహాచలం కొత్త గోశాల, కృష్ణాపురం వద్ద నిర్వహించనున్న శబలా భోజనాలను జయప్రదం చేయాలని తులసి నేచురల్స్ ప్రతినిధి టి. సత్యనారాయణ పిలుపునిచ్చారు.రామకృష్ణా బీచ్ వద్ద నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఐదు రోజుల పాటు ఉచితంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరుకావాలని కోరారు.