VIDEO: మహిళల భద్రతపై వ్యాసరచన పోటీలు
ASR: చింతపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహిళల భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని ఎస్సై ఎం.వెంకటరమణ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హైస్కూల్ విద్యార్థులకు మహిళల హక్కులు, చట్టాలు, భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు.