కుమార్తె అన్నప్రాసన రోజునే తండ్రి మృతి
ములుగు జిల్లా కంతనపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ పల్లబోయిన హన్మంతరావు (44) తమ కుమార్తె అన్నప్రాసనను ద్వారకాతిరుమలలో శుక్రవారం జరుపుకుని సత్తుపల్లిలోని ఇంటికి చేరిన తర్వాత బయటకు రావడం అకస్మాత్తుగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.