జోగి రమేశ్ కుటుంబానికి చెల్లుబోయిన పరామర్శ
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులను తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సోమవారం పరామర్శించారు. ఇబ్రహీంపట్నంలో జోగి కుమారుడు రాజీవ్‌ను కలిసి ధైర్యం చెప్పారు. ఇది అక్రమ అరెస్టు అని, న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.